Thursday, November 1, 2007

ప్రేమాభిషేకం ..(ద షవర్ ఆఫ్ లవ్)

ఇక్కడ నేను అందరికీ తెలిసిన కధనే నాకు తోచిన విధంగా వ్యక్తం చేశాను....
చూడండి ఒకసారి ....మీ అభిప్రాయాలకు welcome........

ఈ కధకి మూలం పంచదార చిలక అనే సినిమాలో చెప్పిన కధ. పాయింట్ తీస్కుని కధనాన్ని ..పాత్రల రూపును చిత్రీకరించాను.ఆ సినిమా లో ఈ కధను రాసిన వారికి ధన్యవాదాలు.

ప్రేమాభిషేకం ...(ద షవర్ ఆఫ్ లవ్)

అదో అందమైన సూర్యోదయం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వెచ్చని కిరణం స్పర్సతో పుడమి పులకరిస్తోంది తన చుట్టూ ఉన్నవారిని మనసారా పలకరిస్తోంది...ప్రకృతి పైట వేసినట్టు ఆ ప్రాంతమంతా పచ్చికతో,పచ్చని చెట్లతో కళకళలాడుతోంది అప్పటివరకు కురుస్తున్న మంచు కరిగి ఆ పచ్చికపై నీటి బిందువులా చేరి సూర్య కిరణాల తోడుతో నింగినుంచి జారే తారలా మెరుస్తూ మనస్సు తలుపును తడుతోంది.భానుని వెచ్చని స్పర్సతో పూలు వికసిస్తున్నాయి.ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిలలు,సెలయేటి గలగలలు,పూల ఘుమఘుమలతో పరువాన్ని పరుగెత్తిస్తోంది.

ఆ అందమైన లోకం లోకి ,భువినున్న స్వర్గంలోకి తొలిసారి వచ్చింది ఓ తెల్లని పావురం. ఆ నందనవనం లోకి అడుగిడుతూ తనను తాను మరచింది మైమరచింది.ఆడుతూ పాడుతూ తోటంతా తిరిగింది.తిరుగుతూ తిరుగుతూ...హఠాత్తుగా ఆగింది ఓ గులాబీని చూసి అది అందానికే అద్దం లాంటి,అర్ధం లాంటి ఓ తెల్ల గులాబీ.అది అరాధనగా చూస్తోంది ఆ పావురం కేసి.తొలి చూపులొనే తన మనస్సును ఆ గులాబీకి అర్పించింది.తన ప్రేమ సందేసాన్ని తన ప్రియురాలికి అర్పించింది ...తను కాదనదన్న నమ్మకంతో ...
ఆ ప్రియురాలిని ఒప్పించటానికి ఆడింది పాడింది,తనను తరచి తరచి అడిగింది.అప్పుడు.....

ఆ అందమైన గులాబీ అతి విచిత్రమైన కోరిక కోరింది.తన అందాన్ని అందలంలో ఉంచమనలేదు తన తనువును తొలకరితో తడపమనలేదు తనను ఒక ఆడంబరమైన ఎర్ర గులాబీ గా మార్చమని అడిగింది.తన తనువును మనస్సును అర్పించి జీవచ్చవమైన ఆ గువ్వ తన జీవం పోయినా ఆ గులాబీని పొందాలనుకుంది అలా,ఓ అసాధ్యానికి శ్రీకారం చుట్టింది.

సూర్యుడు ప్రజ్వలిస్తుండగా వడగాలులు సెగలు కక్కుతుండగా కక్కుతుండగా.....

ఆ అందమైన గులాబీ మొక్క యొక్క ముల్లును తన గుండెకు గుచ్చుకొని
పైకెగిరింది. ఆ గులాబీ పై ఒక్కొక్క రక్తపు బొట్టునూ జార్చింది.
అలా ఆ తెల్ల గులాబీ ఎర్రగా మారింది.సూర్యుడు మసకపడిపోతుండగా మరో సూర్యునివలే ప్రకాసించింది.తన రంగును చూసుకుని గర్వించింది ,ఆనందించింది.తన పంతం నెరవేరినందుకు వికృతంగా నవ్వింది... తనను చూసుకుని మురిసిపోయింది.

తన కోరిక తీర్చిన పావురానికి ప్రేమ కానుక అందించాలి అనుకుంది.కనులు ఎత్తి చూసింది చిరునవ్వుతో ఎదురుగా పావురం ఉంటుంది అన్న తలంపుతో.కానీ పావురం కనపడలేదు,ఆకాశం కేసి చూసింది పావురం కోసం ఐనా అది కనబడలేదు...
సెలయేటి హొరు మారలేదు కానీ తీరు మారింది..చుట్టూ చూసింది ఆ గులాబీ తన ప్రియుని కోసం ,తనతోపాటు ఆ పచ్చిక కూడా ఎర్రగా మారింది అని గ్రహించింది..మరలా చుట్టూ కలియచూసింది.

అప్పుడు ఆ ఎర్రని పచ్చికలో , ఆ గులాబీ మొక్క పాదాల వద్ద కొన ప్రాణంతో ఉన్న ఆ పావురం కనిపించింది , అది గులాబీ కేసి చూస్తోంది చిరునవ్వుతో. ఆ గులాబీ తనకు కనిపించినది చూసి విలవిలలాడింది , విలపించింది.తన ఎర్రరంగును కన్నీళ్ళతో కడుక్కొని తెల్లగా మారింది ....తన మూర్ఖత్వాన్ని నిందించుకుంటూ కుమిలిపోతూ కూర్చుంది .... ఆ అమావాస్య రాత్రిని అసహనంతో,అసహాయంగా గడిపింది.


మరుసటి రోజు సూర్యుడు తనకు కనిపించిన దృశ్యం చూసి నిప్పులు చెరిగాడు.ఆ గ్రీష్మ తాపానికి పచ్చిక ఎండిపోయింది.నిశ్శబ్దం నృత్యం చేసింది.ప్రకృతి తన కన్నీళ్ళతో ఆ ప్రాంతాన్ని సుధ్ధి చేసింది.ఆ పావురాన్ని దాని కౌగిలిలో ఉన్న వాడిన గులాబీని ఆఖరుసారి తనివితీరా స్పృసించింది .......
మూగగా రోదించింది ...........

(శ్రీనివాసమౌళి )

4 comments:

తెలుగు'వాడి'ని said...

శ్రీనివాస మౌళి గారు : ఇందులో చిన్న అంశాలనీ, చిన్న వాళ్లమనీ, చిన్నబుచ్చుకోవటమనే లాంటివి ఏమీ ఆలోచించక్కరలేదు అండి.

I'm more than happy to share/help out on the things I know. Here is the info that might be of help for what you are looking for :

For these basic questions, you can always refer to ...

http://help.blogger.com/
http://groups.google.com/group/blogger-help

And also couple of other good blogs which I frequently refer to are :

http://bloggerfordummies.blogspot.com/
http://betabloggerfordummies.blogspot.com

To make it easy for you, here is the exact link :

http://betabloggerfordummies.blogspot.com/2006/10/how-to-change-template.html

http://bloggerfordummies.blogspot.com/2006/04/blogger-template-tutorial.html
http://bloggerfordummies.blogspot.com/2007/12/upgrade-to-new-blogger-template-from.html

...................

You are still using the 'Classic' template with in Blogger customization and you want to go to a 'Layout' template then first you need to decide whether you want to go to a 2 or 3 column template. Once you made up your mind, here is the web site from where you can download 3 Column templates :

http://webtalks.blogspot.com/2007/04/downlaod-three-column-new-blogger.html

...The concepts of Categories is not there in Blogger exactly like it's there in WordPress....

But if you still want to go for it, here is the link

http://bloggerfordummies.blogspot.com/2006/04/how-to-do-categories.html

I think to start with the best thing for you is not to attempt the above link and instead go for Labels concept that's there in Blogger.

Here is what you should do:

For posts that are already posted :

After you login, click on Customization which will takes you to the Options page in which click on 'Posting' tab where you can see all your posts. Then select the post you want to apply/create the Label then from the dropdown of 'Label Actions' select 'New Label' which will prompt you to enter the name of the label. After this if you want to apply the same label to couple of your other posts, select the post and then select the name of the label from the same dropdown . And the removal of the label also can be done in the same way. And also the same instructions applies to the posts that are in Draft state.

While creating the post:

You can see a Textbox labelled 'Labels for this post' in which either you can select a Label if you already created labels even for other posts or you can enter new label name here.

................

BTW, you can have/apply more than one Label name to the post.

::::::::::::::::::::::::

Hope this helps. Please let me know if you need any further help.

Have fun and enjoy blogging and the customization of the blog too :-)

పావనీలత (Pavani Latha) said...

పాత కథే అనుకుంటూ చదివాను...
కానీ ఇంతలా మనసుకు హత్తుకునే లా ఉంటుందని ఊహించలేదు...
చాలా బాగుంది .
ఆల్ ద బెస్ట్ ....

పావనీలత (Pavani Latha) said...

శ్రీనివాస మౌళి గారూ...చిన్న సలహా...
కొన్ని చోట్ల "స"బదులు, "శ"వాడి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది,ఉదా:సుద్ది బదులు..శుధ్ధి,సందేసం బదులు సందేశం...

శ్రీనివాసమౌళి said...

కదా! ఈ అక్షరదోషాలు మానాన్న కళ్ళపడి ఉంటే... నా తాట తీసి ఉండేవాళ్ళు... :)
నాకు ఈ లేఖిని లో రాయటం కొత్త...అది కాక అంత పెద్దది మొదటి సారి రాసేసరికి... కొన్ని అక్షరదోషాలు దొర్లాయి.. వీలు చూస్కొని తప్పక మారుస్తాను ...నా బ్లాగు తెలుగంత స్వఛ్ఛం గా ఉండాలి.. మీకు ఎప్పుడు ఇలాంటివి కనపడ్డా చెప్పండి...అది నాకూ సంతోషం..
అందుకే డెవలపర్స్ కోడ్ క్వాలిటీ టీం రివ్యూ చేస్తుంది..:) :)

చెప్పటం మర్చిపోయా నా బ్లాగు చదివి మీ అభిప్రాయాలు చెప్పినందుకు నెనర్లు ... :) , అప్పుడప్పుడు అమావాశ్య అప్పుడు తప్ప మా బ్లాగుపై కూసింత వెన్నెల కురిపిస్తూ ఉండు 'చందమామ '