Sunday, December 23, 2007

'స్నేహ'లేఖ.......




తేనె వానలో తడిసిపోతున్నట్టుంటుంది...గతంలోకి తొంగి చూస్తుంటే..
వీణతీగనై మురిసిపోతున్నట్టుంది..స్నేహం నన్ను మీటుతుంటే
స్నేహం అంటే ఇంత తియ్యగా ఉంటుందా!...అనిపిస్తుంది
అమ్మో ఏంటి కళ్ళు చెమరుస్తాయా.. ఇప్పుడు
ఈ స్నేహపు పేజీలు వెనక్కితిప్పి చూస్తూఉంటే..
ఏదో అందమైన అనుభూతి ...
మనసు ..చక్కిలిగింతలు పెట్టినప్పుడు నవ్వే చంటి పాపలా
స్వఛ్ఛంగా నవ్వుతుంది
నవ్వలేక పరవశంలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది
అంతలోనే ఈపరిచయం లేకుంటే అన్నతలపు
ఆ ఊహే చాలా కర్కశంగా ఉంటుంది...
ఆ భయంలోంచే అసలు ఈ స్నేహం సత్యమా..స్వప్నమా అనే పిచ్చి అనుమానం
ఈ నిశ్శబ్దాన్ని ఒంటరి తనాన్ని తరిమేస్తూ....
మళ్ళీ ఆ వీణ సరికొత్తరాగంలో ధ్వనిస్తుంది....
భౌ అంటు మళ్ళీ నా చుట్టూ చేరిపోతుంది....

ఇందుకే దేవుడికి ఒక వరం ఇయ్యాలనిపిస్తుంది...
అప్పుడు మనసు దేవుడికి చెప్తుంది...
తీసుకో నాదగ్గరున్నది ఏదైనా ....ఈ స్నేహం తప్ప...
ఇది వరం ఇయ్యటమో దీవెన అడగటమో మాత్రం తనకు తెలియదు...
(శ్రీనివాసమౌళి)
--------------------------------------------------
ఇది నా స్నేహితురాలైన షర్మి అనే అమ్మయికోసం రాసిన స్నేహలేఖ ...అదేనండి ప్రేమించుకునే వాళ్ళు రాస్తే ప్రేమలేఖ అంటారుగా అలానే స్నేహం చేసినవాళ్ళకు రాసేది స్నేహలేఖ!
ఇది కవిత కాదు...కధ కాదు....మదిలో భావాల సమాహారం అంతే.....
మా జీవితకాలపు స్నేహానికి ఇప్పటికి సంవత్సరం.......
అందుకే ఈ చిరు కానుక .....

15 comments:

Unknown said...

"adbutham" inthakanna kanna pedda padam vadithey nelo garvam peruguthgundani....malli ilantivi chadavalenemo ani ....

thanq naku ne medha unna nammakanniki nyayam chesthunnav...go ahead.

రాధిక said...

చాలా అద్భుతం గా రాసారు.మీ ఆలొచనలు,అభిప్రాయాలు నాకు చాలా దగ్గరగా వున్నాయి.మీ హుండి మరిన్ని అద్భుతాలు ఆశిస్తూ..

Rajendra Devarapalli said...

స్నేహం మీటటం మంచి ప్రయోగం, బాగుంది కొనసాగించండి

.C said...

స్వచ్ఛంగా స్నేహంలా ఉంది...
అచ్చంగా నీలా ఉంది... కవిత!

షర్మి అదృష్టవంతురాలు, తనని స్నేహితురాలిగా పొందిన నువ్వు అదృష్టవంతుడివి. మీ ఇద్దరి స్నేహం ఈ కవితకు ప్రాణం పోయగా చూసే భాగ్యం కలిగిన నేను, ఇతర పఠితలు అదృష్టవంతులం!

rākeśvara said...

చాలా బాగుంది మీ కవిత.. ప్రత్యేకించి ప్రారంభం..
మీరు ఎవరైన భావకవుల కవితలు చదువుతారా?
(నాకిష్టమైంది తిలక్.)

స్నేహం మీదే ఇంత బ్రహ్మాండమైన కవిత రాసారంటే.. ముందు ముందు మీరు చిక్కుల్లో పడతారనిపిస్తుంది :)

శ్రీనివాసమౌళి said...

@చైతన్య
నాకు తెల్సు నీకు నచ్చుతుందని.... చదివి అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్... :)

@రాధిక గారు
మీ కవితలు చూసి నేను ఇదే ఫీల్ అయ్యాను అండి.... మంచిగా రాయాలనే తపన... :)

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ప్రయోగాన్ని మెచ్చుకున్నందుకు ... :)

@కిరణ్ అన్నయ్య
నెనర్లు నెనర్లు .... నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా .. :P :P :P

@రాకేశ్వర రావు గారు
పెద్దగా ఎవరివీ చదవలేదండీ ..
మొన్నీమధ్యే ..అమృతం కురిసిన రాత్రి కొన్నాను..వంశీ మాపసలపూడి కధలు... రమణ గారి బుడుగు ...ఇవి కొంచెం చదివా అంతే...
కానీ సిరివెన్నెల గారి ఏకలవ్య శిష్యరికం చేశా.....మహా ఇష్టం అయనంటే మాత్రం...

@ముందు ముందు మీరు చిక్కుల్లో పడతారనిపిస్తుంది
హహ హ ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ఇలా బ్లాగులు అవీ పెట్టుకున్నాం నాయనా! దేశముదురు డైలాగ్ కి పేరడీ హి హి హి ...
మనకి కష్టాలకి కిలొమీటరు దూరంలేండి .... :) :)

పావనీలత (Pavani Latha) said...

మీరు చెప్పినట్టుగానే
స్వఛ్ఛంగా నవ్వే చంటిపాపలాగే ఉంది మీ కవిత....

Anonymous said...

ammayila tho snehame adbutham ga vuntundhaa...? abbayila dhi vundadhaa...? mama kullukuntunnanu... :(

1 year ke yilaanti kavitha raasthe mana 4 years ki yelantidhi raayaali...? Just think of it.

Anyways i'm always fan of you.. :)

Bolloju Baba said...

చాలా బాగుంది
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

mee Madhu said...

a Devudu meku one varam ante Sharmi ni one divena ante ameto Snehani ecchadu.

vkc said...

bhaavam bahubagundi !... adi telivitho rasindi kaadu... manasutho rasindi ani kooda arthamautoondi :)

Vasu said...

" అన్నతలపు" ఇది చూసి ఇదేమి కొత్త పదం అనుకున్నా.. "ఈపరిచయం లేకుంటే" అన్న తలపు అని అర్థం అయ్యింది ఆ తరువాత .

"భౌ...."
ఇక్కడి వరకు చాలా బావుంది.
"ఇందుకే ..."
దీనికి ముందు ఉన్న ఒక నడక, ఇక్కడినించి తగ్గినట్టు అనిపించింది. భావం అందంగా వుంది కానీ ..మీరు ఇక్కడ (నడక) ఇంకా బాగా రాయగలరేమో అనిపించింది.

ఇయ్యాలనిపిస్తుంది.. ఇవ్వాలనిపిస్తుంది... ఏది సరియైనది??

మొత్తానికి .. స్నేహలేఖ బావుంది.

శ్రీనివాసమౌళి said...

@Chandra: :) :)
@బొల్లోజు బాబా: బొల్లోజు బాబా
మీలాంటి అనుభవజ్ఞులనుండీ చాలాబాగుంది అనిపించుకోవటం చాలాబాగుంటుంది :) ధన్యవాదాలు

@Madhu: gud one

@స్వామి రాక్షసానంద:నువ్వు కూడా తెలివితో కాక.. మనసుతో చదివావని అర్ధమయ్యింది :)

@Vasu:విశ్లేషణకు చాలా థాంక్స్... సునిసితంగా సూటిగా ఉన్నాయి మీ కామెంట్స్... మీరు అన్నది నిజమే... స్నేహాన్ని అందరూ ఒకేలా అర్ధంచేసుకుంటారో లేదో అన్న సందేహంతో... exact గా మీరు చెప్పిన చోటనుండి వచ్చే కొన్ని లైన్లను బ్లాగ్ పోస్ట్ లో తొలగించి చివరి లైన్స్ ని జతపరిచాను ...

@ఇవ్వాలనిపిస్తుంది: idE sari ainadi... vADukabhAshalO iyyAlanipistundi.. kUDA vADukOvaccu...

నా తదుపరి రచనలపై కూడా మీ కామెంట్స్ అందించండి...

రాజేష్ మారం... said...

Excellent Mouli :)

స్నేహ లేఖ కాన్సెప్ట్ & నువ్వు రాసిన లేఖ సూపర్..

దేవుడికే వరమిచ్చేంత గొప్పోడివయిపోయావ్.. :) నాకూ ఓ రెండు-మూడు వరాలు కావలి మరి :)

శ్రీనివాసమౌళి said...

@Rajesh maram: ఇచ్చి ఇచ్చీ ఇప్పుడు నాకే వరాల కొరత ఏర్పడింది నాయనా :) ఫార్మ్ నింపి వెయిట్ చెయ్యి :) melligA chUddAm