Monday, June 22, 2009

బుడుగు ...బుల్లి అల్లుడి ఖద :)

ఈ మధ్య మా family family కి promotions వచ్చాయ్ :)
మా అక్కకి బాబు పుట్టాడు... చూడటానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక 'చిన్న బుడుగు' లాంటి కధ రాశా...
నిజానికి బుడుగు లాంటి character ని అనుకరించటం ఒకింత సాహసమే అని తెలుసు...
hope you like it....

బుడుగు

నా పేరు జూనియర్ బుడుగు...నేను పుట్టి రేపటికి మొన్న....
మా అమ్మ పేరు సుష్మ...నాన్న పేరు నాన్న...
మా మామయ్య పేరు మౌళి...మామామయ్యకి సిగ్గెక్కువ ఎవళ్లతోను మాట్టాడడు...
అమ్మాయిలతొనే పోట్టాడుతాడు..వాడు పాటలు రాస్తాడు...
పాటలంటే మాటలే కాని వాటిలిని పాడుతారు
వాడి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నై... softwareలు...కొత్త పాటలు...సుత్తి పాటలు ..నత్తి పాటలు(త్యూనులు అంటారులే)
(నేను ఎప్పుడూ ఉంగా ఉంగా అని ఏడ్చినట్టు...పాటంతా త న నా...త న నా అనే పాడుతారు....)
నాకు కూడా పాడటం వచ్చు కాని త న నా అవి రావు...పాడాలనిపిస్తే...పాడినట్టు ఏడుస్తా...కళ్ళుమూచుకుని...

నాకు నవ్వటం కుంచెం వచ్చు...మాట్టాడటం అస్సలు రాదు... యాడవటమే బాగా వచ్చు
అందరూ నేను బాగా ఏడుస్తా అని మెచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు....నాకు అది నచ్చదు...ఏడవటం కాదు వాళ్ళు నన్ను ముద్దులు పెట్టుకోటం
అందుకే ఇంకా గాఠిగా ఏడ్చేస్తాను... అప్పుడు ఇంకా గఠిగా ముద్దులు పెట్టేస్కుని...జో జో బజ్జో...ఒళళళళళా హాయమ్మా ..హాయివారబ్బాయి ఆపదలుగాయి ...చిన్ని తండ్రినిగాయి సీవెంకటేశా!...అని పాడి బెదిరించుతారు
అందుకే మనం ఇలాంటి పాట మొదలవ్వగానే యాడవటం ఆపి నవ్వాలి లేదంటే వాళ్ళు ఆపరు...

నేను ఎందుకు ఏడుస్తానో నాకు తెలీదు....మా అమ్మకి కూడా తెలీదు... మహా మహా మా అమ్మమ్మకి కూడా తెలీదు..
నిజ్జానికి డాక్టరుకి కూడా నేను ఎందుకు ఏడుస్తానో తెలీదు.. కాని ఎవరికి ఏమీ తెలీదని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది
అసలు పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు...నేను ఉచ్చపోచ్చుకొని ఏడిస్తే... పాల పీక తెచ్చి నోట్లో పెట్టేస్తారు...
వద్దన్నా కాని తాగు తాగమ్మ...చీ చీ...పోచ్చి అంటారు..పోనీలే అని మనం కుంచెం తాగటానికి ట్రయ్ చేస్తామా... మొత్తం తాగెయ్యమంటారు..
పాలు వేస్టు అయిపోతయ్ అంటారు... నేనేమైనా పాలు కావాలి అని ఏడ్చానా...పాలు వద్దని ఏడిచానా...ఉచ్చపోచ్చుకుని లంగోటి తడిసిపోయిందని ఏడిచాను..
పాలు పట్టేసినాక నా లంగోటి చెక్ చేసి...అరే వీడు ఇప్పుడే పాలు తాగి అప్పుడే పోసేశాడే అని నవ్వుతారు...
అప్పుడు నాకు నవ్వు వస్తుంది...కాని నేను నవ్వను ఎందుకంటే నాకు నవ్వటం బాఘా రాదు

నాకు యాడవటం బాగా వచ్చు... అమ్మకి బయంపడటం అమ్మమ్మకి జోల పాడటం వచ్చు...
డాక్టరుకి కవర్ చెయ్యటం వచ్చు... మెడికల్ షాపు వాడికి బిల్లు వెయ్యటం వచ్చు...నర్సుకి ఇంజెక్షను చెయ్యటం వచ్చు....
అందుకే నర్సు వచ్చినప్పుడు మనం యాడవకూడదు.. ఎత్తుకుంటే మాత్రం గాఠిగా ఏడ్చెయ్యాలి...

నాకు పాలు పట్టుతారు...అది నాకు నచ్చకపోతే నేను గుక్కపట్టుతాను...నిజ్జం ఏడుపులా నటించుతాను
అప్పుడు అమ్మ భయపడి...అమ్మా! అమ్మా! :( అని అమ్మమ్మని పిలుచుకుంటుంది.....
నేను ఇలా అమ్మకి కుంచెం భయం పెట్టుతాను,,, లేదంటే పెద్దవాళ్ళు మనమీద అజమాయిషీ చేసేస్తారు,,,
చిన్నపిల్లల కింద లోకువ కట్టేసి పాలు పట్టేస్తారు
మా అమ్మ అప్పుడెప్పుడో పుట్టింది..అయినా నేను మా అమ్మకి నిన్నటి వరకు తెలీదు,,,,
నాకైతే పుట్టినప్పటినుంచి మా అమ్మ తెల్సు...

నాకు AC అన్నా లంగోటి అన్నా... చాలా ఇష్టం రెండూ చల్లగా ఉంటయ్....
ఇంకా మా మామయ్య కొనుక్కొచ్చిన జుబ్బా వేచుకుని కళ్ళూ మూచుకుని దోమతెర అంబ్రిల్లా లో పడుకోటం ఇంకా ఇష్టం

మా నాన్నకి సెలవలు లేవంట...మా మామయ్యకి తాతయ్యకి(నాన్న తాతకి...అమ్మ తాతకి) కూడా లేవంట...
నా దగ్గర మాత్రం ఉన్నయ్యా ఏంటి నాకు అసలు సెలవంటే ఏంటో కూడా తెలీదు ఇంక నా దగ్గర ఎలా ఉంటయ్
నా దగ్గర ఉంటే కుంచెం ఇచ్చేవాడినే ఎందుకంటే నేను మంచివాడిని...ఛాలా మంచి వాడిని...పండు వాడిని..

నాకు అమ్మ పోలికా?..నాన్న పోలికా?... ఎవరిపోలిక అని అంటూ ఉంటారు కాని నాకు అస్సలు మా తాత పోలిక
నిన్నే ఈ విషయం కనిపెట్టా ఎందుకంటే మా తాతకి కూడా నా లాగే పళ్ళు లేవ్

--శ్రీనివాసమౌళి

చెప్పటం మర్చిపోయా! నాకు "హి" అనే అక్షరంతో పేరు పెట్టాలి... మీకు ఏమైనా పేర్లు అనిపిస్తే బుడుగుకి పేరు అని సబ్జెక్టు పెట్టి మా మామయ్యకి నాలుగో ఫదో పేర్లు కామెంట్లో చెప్పండి

37 comments:

ramya said...

అమ్మోయ్ జూనియర్ బుడుగుకి చాలా తెలుసు! చ ఈ పెద్దాలున్నారే వీళ్ళకేమీ తెలియదు!

శ్రీనివాస్ గారు చాలాబాగా రాసారు.
జూనియర్ బుడుగుకి నా ముద్దులు

శ్రీనివాసమౌళి said...

మీరూ ముద్దులు పెట్టేశారా! పాపం...వాడి బాధ అందరూ ముద్దులు పెడుతున్నారనే! :P

dhrruva said...

హి-మాన్ !! యెలా ఉంది?? హి హిహ్ హి

హితేష్ ట్రయ్ చెయండి

dinesh said...

Simplicity is the beauty of this expression. Great Style.

Murthy said...
This comment has been removed by the author.
నీ నేస్తం said...

amma bujji budugu enni Khaburlu cheppestunnavo!!!!!

sare ne peru adigav kada... neku langoti, AC ante istam kada challaga untayani anduke "HIMESH" ani pettuko... sarena... peru pettukunnaka naku gaaaattiga cheppeyali...

నాకు పాలు పట్టుతారు...అది నాకు నచ్చకపోతే నేను గుక్కపట్టుతాను idi bagundi lol :))

Sujata said...

So sweet. Im wondering.. if i had a brother.. (mavayya), would he write smthng like this after three months..:) ???

Lovely.

Hritik, Hriday, Hitesh, Hira lal, Himant... inka tattatledu.

kanakaraju said...

hi ra,

mouli

blog chala bagundhe

kanakaraju said...

nice blog ra
bye

moorthi said...

మా మామయ్య మోసగాడు... కాపి లయితు తీచుకొకుండా నా మాతలన్నీ పబ్లిచితీ చేసేస్తున్నాడు... నాకు పబ్లిచితీ అంటె తెలీదు... మూర్తి మమయ్య చెప్పాడు... అందుకె మూర్తి మామయ్యకి చెప్పా కాపి లయితు తీచుకొమని.. మూర్తి మామయ్య నన్ను "బుడుంగు" అంతాడు... నేను బాపు తాతయ్యగారి రమన తాతయ్యగారి "బుడుగు" లాగె ఉన్నానంట... అలాగె మట్లాల్తానంతా... మా మామయ్య బోల్లు బాగా రాచేడంట నా గురించి... థాంచ్ రా మౌలి..

raghu said...

Hi Jr.Budugu....
Neeku mee thatha polikalu kadhu raaaa.... Mee Mama Polikalu vachayi raa... Kani mee Mama Budhi Manaki vadhuley raa...Mee Mama appudey jubba ichi ninnu kaka paduthunadu choodu... anthey raaa ee mamalu anthaa...

Mahi said...

Hiresh
Hiten
Hriday
Hridayesh

Nice post :)

GURU CHARAN SHARWANY said...

Helloo seenu...adhharagotttaav...

Ippudu highlights
1.Neenu puui reepatiki monna...idhi keeka
2.paalu thaageesaakaa.."veedu chudu ippudee thaagi apudee pooskunnaadu" anadam gud piece of observation...(kaani tharavatha baabukooda navvatam sink ainattuga anipinchaledhu)
3.Domathera umbrellani prasthaavinchatam..chadhuvaralani sceen loo ki indepth gaa theesukelthundhi...
4.Climax thaatha poolika is veery nicee...
5.Selection of Concept

all in all veey gudd posting!!!

Phanindra said...

nuvvu raasindi chadivi haayigaa navvESaa! chakkaTi rachana. konni chOTla buDugulO vaakyaalu gurtuku testuu, konni chOTla niidaina creativity ni chuupistuu bhalE baagundi.

buDuguki muddulu. "hi" tO pEranTE "hiirO" ani peTTEstE pOlaa!

శ్రీనివాసమౌళి said...

@ధ్రువ్: హ హ హ హసిని లా హి హి హి హీ-మన్ :P బాగుంది

@దినేష్: thank you so much

@ నా నేస్తం: thanks for your comments and హిమెష్ బాగుంది పేరు

@సుజాత గారు:సయ్యారే సయ్యా నేనేర మావయ్యా! అని :D :D అప్పుడు భి నేనే రాసేస్తా ఏమంటారు :)

@కనకరాజు: thanz మామ

@ మూర్తి మామయ్య: బాగుందయ్యా మామయ్యా! తిట్టినట్టు పొగిడావ్ అంటే నీకు నచ్చిందన్నమాట :)

@రఘు:వాడు already నా style lo నిద్రపోతున్నాడుట evening call లో అక్క చెప్పింది..
కాకా పట్టడానికి చేసింది కొత్త జుబ్బా వెయ్యటం కాదురా! కొత్త పోస్టు వెయ్యటం :)

@ మహి: interesting names...నాలుగో ఫదో అంటే exact గా నాలుగు పేర్లు చెప్పారా! :)

@గురు: Thanks for the detailed comments

@ఫణి: హీరో నా వద్దులే మనిద్దరం కలవకుండా కలిసి రాసిన హీరో సినిమా గుర్తొస్తూ ఉంటుంది :) :)

santu said...

Super Babai Blog bagundhi

TestingWheel said...

Sahasam cheyatame antoone, easy ga rasesAv Mouli ...super ga undi ....idi ani hilight cheyyalem...chala unnayi oo ppado muppayyO sarlu chadavali .......chali istam ani poddaka langoti tadupukovaddani cheppu mee bulli budugu ki :P ....

excellent attempt ....!

pEru naku kooda himesh, hemanth(old ayipoyindi idi) ...himasrinivas (jr.budugu kadA..hi hi)...Himouli,Himay,Hruday,Hardik,Howai, Harbish,Hotish...inka laksha padivelu unnayi ....malli rasta...

టింగు రంగడు said...

సృజనాత్మకం గా ఉంది..

జూనియర్ బుడుగు గురించి మీరు ఇంకా రాయాలి..

మాలా కుమార్ said...

maamayya gaari ki congratuletions.

DHANANJAYA said...

బుడుగు ...బుల్లి అల్లుడికి ఒక చిన్ని పెళ్ళాన్ని ఇవ్వమని మామయ్యకి చెప్పా.. మరి ఎపుడు ఇస్తాడో.. ఏంటో.. ఈ కాలానికి ఆ మాత్రం ఫాస్ట్ ఉండాలి లేండి. ఎపుడు ఇస్తావ్ మామా..

నీ బుల్లి బుడుగు అల్లుడు

Sandeep said...

baagundi sOdaraa nee bujju vyaasam :) maanchi comedy timing undi!

Me Inc said...

nEnu ceppAlanukunnavi already andaruu ceppESAru...excellent attempt !

My observations concur with ur frnd guru charan's...

ii rAkhi ki inTiki vachEyi...maa abbAyi puttinappudu kUda ilA rAsei mAmA :-)

Haritha (Phani's wife)

sandhya said...

జూ:బుడుగు బాగుంది.
సీ:బుడుగు గారికి కంగ్లాసు
చాలా నవ్వు కున్నాను చదివి, నిజం గానే ఇలానే అనుకుంటారేమో చిట్టి తల్లులు, తండ్రులు అందరు

TestingWheel said...

As some one said, pls continue this Mouli ....

firstly is it all possible? if so they would hv extended original budugu also ...na ...so its the story of 2 days old bulli budugu ...he is same always .......so you can give a try diff budugus.....budugu in achool...budugu in college ..khi khi ...software budugu.....lyricyst budugu :P

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది శ్రీనివాస్ గారు.

Moorthy said...

Nice blog sailu....aa budugu chesevanni maaa budigi kooda chesthondi :)

Moorthy said...
This comment has been removed by the author.
vinaybhasker said...

hi mouli garu I enjoyed every word in the article.Its as fresh as and as energitic as a child's smile.keep it up

jyotsna said...

చాలా బాగుంది....కథ చదివాక నిజంగా పిల్లల ఫీలింగ్స్ ఇలగే వుంటాయా అనిపించింది...చల్లని చందమామలా వుంది నీ బుల్లి బుడుగు కథ...గుడ్ వర్క్...నీ రచనలతో ఇలానే ఎప్పటికీ మమ్మల్ని అందరిని అలరిస్తూ వుండు....

శ్రీనివాసమౌళి said...

హలో...All
మొన్న ఆదివారం బారసాల అయ్యింది...మా బుడుగు గాడి పేరు సాకేత్...

sreenivas said...

hello mouli! It's simply p(f)entastic!
oka somta caricature ni kuda I blOg lO insert cEstE bAgumtumdi IsAri nEnu I blOg lO A cAricAture ni cUdAlnukumtunna

durga said...

namaskaram mouli garu,
mee junior budugu gari kadha... chala lively ga realistic ga unnadi.. oka sari modalu pettina taravata... aapakunda, bore kottinchakunda chadivinchela unnadi... oka chinnapilla vadu edurukunda matladutunnattu anipistondi.... meeru aa budugu gari photos, and vari ghanakaryalu kuda ikkada pondu paristhe bavuntundemo...!!! ani na abhiprayam.... finally this story is simply superb,ksharamu kani aksharalaku mee yokka rachanalato chese ee aksharaarchana nirantarayamga konasagalani.... meeru unnata sikharalani adhirohinchalani manaspurtiga korukuntunnanu.

K. మహేష్ కుమార్ said...

హిరణ్యాక్షుడు.

swathi said...

supper ga undi ra babu ni alochana bangaru konda amma nu edipinchaku mamayya edipinchu sarena bangaram[budugu]bye....

రాజేష్ మారం... said...

ఇంతమంది చెప్పాకా, ఇంకేం చెప్తాం :)

అందంగా ఉంది..

శ్రీనివాసమౌళి said...

@Rajesh Maram: Thank u

sahithi said...

Nice story..... BUDUGU... it's a famous stories... On that name... but really nice...Reading it...Mana Telugu vallaki ....Maaa blog visit cheyandi......www.Teluguvaramandi.net...Meee viluvyina abhiprayalu ivvagalaru...