Thursday, February 11, 2010

ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!

కిరణ్ అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు... నేను... కిరణ్(అప్ కమింగ్ పాటల రచయిత).. అవినాష్(వినాయకుడు సినిమా పాటల రచయిత)
కలవటం జరిగింది... ముగ్గురం సినిమాల గురించి...సినిమా పాటల గురించి చర్చించుకుంటుండగా ... మాటల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా హిట్ కాని పాట ఒకటి కిరణ్ వినిపించాడు..వేటూరి గారి రచన అది... దానికి వైరముత్తు గారు తమిళ్ లో పాట వ్రాశారు..ప్రతి లైన్ ...అడిగా! అని పూర్తవుతూ భలే బాగుందనిపించింది పాట...అప్పట్లో నేను బెంగళూరు లో పనిచేసేవాడిని... ఆరోజు తిరుగు ప్రయాణమయ్యా...వోల్వో బస్సులో..ఏమీ తోచని టైం లో ఏవో లైన్స్ గుర్తు వస్తున్నాయి.. సెల్ తీసి రాసేశా... చివరికి మూడు నిమిషాల్లో వ్రాసిన SMS కవిత అయ్యింది.
కొంతమంది స్నేహితులు(ప్రియనేస్తం చంద్రశేఖర్) ఇది నచ్చి కొత్తబంగారులోకం అనేపేరుతో డెస్క్ వద్ద అతికించుకోవటం... గొప్ప అనుభూతిని మిగిల్చింది..ప్రేరణ కిరణ్ అన్నయ్యో! వేటూరి గారో! ముంబై ఉగ్రవాదుల దాడిలో బలైన జవాన్లో ...ఏమో ఎవరో తెలియదు..
నాకు ఈ కవిత చాలా ఇష్టం ....


ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!
అనుబంధాలకు అర్ధం అడిగా!
పెనుగండాలను ప్రేరణ అడిగా!
ప్రగతి పధానికి అడుగులనడిగా!
జగతి రధానికి సారధినడిగా!
సత్యం కోరే సంఘం అడిగా!
నిత్యం నిలిచే ప్రేమను అడిగా!
నేనంటే? అని ఈ క్షణాన్ని అడిగా!
మదిని మలచు నిశ్శబ్దం అడిగా!
కసిని పిలుచు కష్టాన్నే అడిగా!
కాలం కలిపే బంధం అడిగా!
మనిషిగ నిలిపే మరణం అడిగా!
తనువు కరిగితే తలపుగ మిగలగ ....
చరిత హృదిని మరుజననం అడిగా!
-- శ్రీనివాసమౌళి

7 comments:

swami rakshasananda said...

naaku kooda oka koti roopailu adagacchu kada ! :P

ee paata adbhutam cinemalondi kada.. .bagundi lyric !

శ్రీనివాసమౌళి said...

కేశవచరణ్ ..thanks
అద్భుతం సినిమాలో పాటకు అనుసృజన...ఐతే approach లో తేడా ఉంది. ఇక్కడ నేను చెప్పినవన్నీ introspection ని ఆధారంగా చేసుకుని వ్రాయటం జరిగింది.

నీ introspection నీదే కాబట్టి నీ కోటి నువ్వే అడగాలోయ్..

vinaybhasker said...

hi mouli baagundi ee kavitha.inka nee trials elaa unnayi?
any chances in new movies?

వేణూ శ్రీకాంత్ said...

బాగుంది మౌళి గారు.

చందమామ said...

కసిని పిలుచు కష్టాన్నే అడిగా!

చాలా నచ్చింది, నాన్నగారు తరచూ చెప్పే మాట
కష్టాన్ని,కన్నీటిని కసిగా మలచుకుంటే సాధించలేంది ఏదీ ఉండదు అని.
అవి ఎప్పటికీ మర్చిపోలేని సత్యాలు.

మళ్ళీ జ్ఞప్తికి తెచ్చినందుకు థాంక్స్.

అడగడం మరిచిపోయా..
ఇంకా నా బ్లాగులో పాటలు కాపీ చేస్తున్నారా...

శ్రీనివాసమౌళి said...

@వినయ్: thank you... trials చాలా తక్కువే... అవకాశాలు కృషికి తగినట్టుగా ఉన్నాయి... ఈ సంవత్సరం ప్రధమార్ధంలో తెరను పలకరించే అవకాశాలు ఉన్నాయి...
neither lyric writing is easy nor the film making .. you know everything :)

@వేణూ శ్రీకాంత్: చాలా సంతోషం అండి.. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు

@చందమామ:
:) చాలా రోజూలకు ...ఎలా ఉన్నారు..ఏంటి సంగతులు..
నాకు కూడా ఆ expression చాలా ఇష్టం...
నేను బాగ్స్ లో అంత active కాదు కదా! ఈ మధ్య మీ బ్లాగ్ ను చూడలేదు ..కాపీ చెయ్యలేదు... తప్పక చేస్కోవాలి... మీ collection అంత బాగుంటుంది మరి

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి said...

బాగు౦ది

http://bhamidipatibalatripurasundari.blogspot.in/